శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 10 మే 2018 (08:59 IST)

మహానటి అద్భుతంగా ఉంది : కేటీఆర్ ట్వీట్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం బుధవారం (మే 9వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం బుధవారం (మే 9వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
ఈ కోవలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా చేరిపోయారు. ఆయన ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తన స్పందనను ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. 'మ‌హాన‌టి' చిత్రం చాలా అద్భుతంగా ఉంద‌న్నారు. నిజంగా ఈ చిత్రం ఎంత‌గానో అల‌రించింది. సావిత్రి పాత్ర‌కి కీర్తి సురేష్ జీవం పోసింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు అంటూ పేర్కొన్నారు.
 
సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యల నటన అద్భుతంగా ఉందని కేటీఆర్ త‌న ట్వీట్ ద్వారా కొనియాడారు. మ‌హాన‌టి చిత్రంపై ఇప్ప‌టికే రాజ‌మౌళి, రాఘ‌వేంద్ర‌రావు, అట్లీ, సుశాంత్‌, మోహ‌న్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో సావిత్రి పాత్ర‌ని కీర్తి సురేష్ పోషించ‌గా, జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించారు.