బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (19:23 IST)

ఆర్ పి పట్నాయక్ సంగీతంతో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ చిత్రం

Seven hill opening
రాజ్కృష్ణ దర్శకత్వంలో సతీష్ కుమార్.ఐ, కళ్యాణ్ సుంకరలు నిర్మిస్తున్న నూత‌న చిత్రం ఉగాదినాడు అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. నూతన నటీనటులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ముఖ్య అతిథి హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, కమెడియన్ అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సతీష్వేగేశ్న గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
నిర్మాత సతీష్ కుమార్.ఐ మాట్లాడుతూ, నేను ఇంతకు ముందు తీసిన సినిమాతో ఎం చేయాలి. ఎం చేయకూడదో నేర్చుకొని ఈ రెండవ సినిమా చేస్తున్నాను. ఎప్పటి నుండో మిత్రుడైన యూ మీడియా కళ్యాణ్ సుంకర ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్గా పరిచయం చేస్తూ.తనతో కొలబ్రేట్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే చిరకాల మిత్రుడు ఆర్ పి పట్నాయక్ మళ్ళి మా సినిమాతో కం బ్యాక్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. మా చిత్ర దర్శకుడు రాజ్ కృష్ణ ద‌ర్శ‌కుడు తేజ దగ్గర పలు చిత్రాలకు ప‌ని చేశాడు. సురేష్ ప్రొడక్షన్ లో ఫిల్మ్ స్టూడెంట్ కూడా..ఇలాంటి మంచి వ్యక్తిని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను అన్నారు.
 
లైన్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ సుంకర మాట్లాడుతూ, యూ మీడియా నుండి చాలా ఈవెంట్స్తో అసోసియేట్ అవుతూ చాలా మంది ఆర్టిస్టుల డేట్స్ చూసే వాన్ని. ఎప్పటి నుండో మంచి టీమ్‌తో సినిమాతీయాల‌నే కోర‌కి వుంది. అది ఈరోజు నెర‌వేరింది. రాజ్ కృష్ణ సినిమాలకు కథలు రాసేవారు. యూ మీడియా నుండి కాస్టింగ్, ప్రొడక్షన్ వరకు ఈ సినిమాకు అన్ని బాధ్యతలు తీసుకొని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సతీష్ గారికి సపోర్టు చేస్తాము. తొందర్లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూట్ చేయ‌నున్నామ‌ని తెలిపారు.
 
దర్శకుడు రాజ్ కృష్ణ మాట్లాడుతూ, మే నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేస్తాం.ఇది ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం .అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు 
 
సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ, మా గురువు గారు బాలు గారు మ‌ళ్ళీ మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ ఆనేవాడు.నేను ఆప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఆయన మాటలే గుర్తుకు వస్తాయి. మిత్రుడు సతీష్ ఫస్ట్ ప్రొడక్షన్ లో మంచి సినిమా తీసి మంచి విజయం అందుకున్నాడు. ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
 సాంకేతిక నిపుణులు 
బ్యానర్ : సెవెన్ హిల్స్ ప్రొడక్షన్, నేహా శ్రీ క్రియేషన్స్
సమర్పణ : శ్రీమతి వీణదారి
ప్రొడ్యూసర్ : సతీష్ కుమార్.ఐ
రచయిత, డైరెక్టర్ : రాజ్ కృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ : క‌ళ్యాణ్ సుంకర
మ్యూజిక్ డైరెక్టర్ : ఆర్ పి పట్నాయక్
ఆర్ట్ డైరెక్టర్ : బి. సుప్రియ
 ఎడిటర్ : రాంబాబు మేడికొండ
క్యాస్ట్యూమ్ డిజైనర్ : అశ్విని ముల్ పురి & గంగాధర్
పి.ఆర్.ఓ : ఏలూరు శ్రీను - మేఘ శ్యామ్