సోమవారం, 23 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (07:38 IST)

మ్యూజిక్ డైరెక్టర్స్ కు సవాల్ విసిరిన శారీ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

Aaradhya Devi
రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి 'శారీ' అనే చిత్రం రాబోతోంది. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు.  గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో 'శారీ'ని ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ వ్యాపారవేత్త  రవి వర్మ, సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా  పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో  సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' మూవీ రూపొందుతోంది. 
 
తాజాగా శారీ సినిమాలో "ఐ వాంట్ లవ్" లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (కృతిమ మేధ) సప్తస్వరాలతో విన్యాసాలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు, పాటల రచయితలకు సింగర్స్ కు సమానంగా సవాల్ చేస్తుంది. 
 
"మా పార్టనర్ రవివర్మతో కలసి నేను 'ఆర్జీవీ డెన్ మ్యూజిక్'ను ఆరంభిస్తున్నాని చెప్పడానికి థ్రిల్ ఫీలవుతున్నాను.ఇందులో  ఏఐ యాప్స్ తో రూపొందిన సంగీతo మాత్రమే ఉంటుంది.  'శారీ'లో మొత్తం ఏఐ సంగీతంతోనే సాగుతున్నాం. నేపథ్య సంగీతాన్ని కూడా ఏఐ మ్యూజిక్ నే ఉపయోగిస్తున్నాం అన్నారు. 
 
రామ్ గోపాల్ వర్మ తన మొదటి చిత్రం 'శివ' లో  కొన్ని సన్నివేశాలను  ప్రప్రధమంగా స్టడీ క్యామ్ తో చిత్రీకరించి సినిమా పరిశ్రమకు సరికొత్త సాధనాన్ని పరిచయం చేసారు. అలాగే రక్త చరిత్ర చిత్రం తో డిజిటల్ కెమెరాలను పరిచయం చేసి రీల్స్ లేకుండా ఫిలిం లాబ్స్ ని మూయించారు. ఇప్పుడేమో మ్యూజిక్  రంగంలో మ్యూజిక్ డైరెక్టర్స్, గీత రచయితలకు, సింగర్స్ కు పనిలేకుండా చేసేలా వున్నారు. ఇక ఆర్జీవీ డెన్ నుండి ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్ బ్యానర్ లో రాబోతున్న 'శారీ' సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఈ సారి  A I లేటెస్ట్  టెక్నాలజీని మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో ప్రయోగించారు.
ఇక భవిష్యత్ లో మ్యూజిక్ కి సంబందించిన టెక్నిషన్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్, పాటలు రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్లు అందరు చరిత్రలో మిగిలిపోతారు.  
 
రూపాయి ఖర్చు లేకుండా  ఏఐ యాప్స్ ద్వారా సంగీతాన్ని సమకూర్చడం, పాటలు రూపొందించడం, వాటిని కావలసిన తీరున మలచుకోవడం ద్వారా మనకు ఇష్టమైన ట్యూన్ లో, ఇష్టమైన వాయిస్ లో క్షణాల్లో  కావలసిన విధంగా పాటల్ని ఏఐ ఇస్తుంది. అంతేకాదు, ఈ యాప్స్ ద్వారా  సంగీతంలో మనదైన ప్రత్యేక గుర్తింపునిస్తుంది.
 
ఏఐ టెక్నాలజీని వాడటం వల్ల నేను కోరుకున్న విధంగా మ్యూజిక్ చేసుకోవచ్చు. సామాన్యులకు సైతం  అర్ధమయ్యేలా ఏఐ మ్యూజిక్ అందుబాటులోకి వచ్చి ఓ 'బిగ్గెస్ట్ గేమ్ చేంజర్' కాబోతోంది. సంగీతం నేర్చుకున్నవారే కాదు ఇకపై సరిగమలు అంటే తెలియని డ్రైవర్, రైతు కూలి, నర్స్, కాలేజ్ స్టూడెంట్, స్కూల్ పిల్లలు, ఒకరేమిటి మ్యూజిక్ పై అభిమానం ఉంటే చాలు కోరుకున్న తీరున ట్యూన్స్ పలికించే అవకాశం ఉంది. కొందరు ఏఐ యాప్స్ తో మంచి సంగీతాన్ని రూపొందించలేరు అని వాదించవచ్చు. అయితే ఏమిటి 'మంచి'? ఒకరికి ఇష్టమైనది మరొకరికి ఇష్టం కాకపోవచ్చు. మరి ఏది మంచి మ్యూజిక్ అని ఎలా నిర్ణయించగలం