బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వసుంధర
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (12:17 IST)

శివాజీ గణేశన్ 93వ జయంతి Googledoodle

అక్టోబర్ 1 శుక్రవారం, దివంగత నటుడు శివాజీ గణేశన్ 93 వ జయంతిని పురస్కరించుకుని, గూగుల్ ఆయనపై డూడుల్‌ని అందించి నివాళి అర్పించింది. బెంగళూరుకు చెందిన కళాకారుడు నూపూర్ రాజేష్ చోక్సీ డూడుల్‌ను సృష్టించారని గూగుల్ పేర్కొంది.

 
ట్విట్టర్‌లో డూడుల్‌ను షేర్ చేసిన వారిలో ప్రముఖ నటుడు మనవడు నటుడు విక్రమ్ ప్రభు కూడా ఉన్నారు. లెజెండరీ శివాజీగణేశన్ 93 వ పుట్టినరోజు సందర్భంగా Googledoodle సన్మానిస్తోందని అన్నారు. శివాజీ గణేశన్ 1928 అక్టోబర్ 1న మద్రాసు ప్రెసిడెన్సీ (ప్రస్తుత తమిళనాడు) లోని విల్లుపురంలో జన్మించారు. కేవలం ఏడేళ్ల వయసులో, సినిమాలపై ఆసక్తితో థియేటర్స్ గ్రూప్‌లో చేరడానికి తన ఇంటిని విడిచిపెట్టారు. డిసెంబర్ 1945లో గణేశమూర్తి "శివాజీ కంద హిందూ రాజ్యం" అనే నాటకంలో మరాఠా పాలకుడు శివాజీగా నటించారు. ఆ పాత్రతోనే ఆయన పేరు గణేశమూర్తి నుంచి శివాజీగా నిలిచిపోయింది.

 
ఆయన తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేసినప్పటికీ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలతో సహా దాదాపు 300 చిత్రాలలో గణేశన్ కనిపించాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన కెరీర్‌లో అనేక అవార్డులు గెలుచుకున్నారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయ నటుడు (కైరో, ఈజిప్ట్‌లో ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్), 1960లో నటించిన వీరపాండియా కట్టబొమ్మన్ చిత్రానికి ఆయనకు అవార్డు దక్కింది.