శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (10:36 IST)

మంచు మనోజ్ ఇక సినిమాల్లో నటించడట.. రాజకీయాల్లోకి వస్తాడా?

మంచు ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసిన మంచు మనోజ్ సినిమాలకు దూరం కానున్నాడు. తన తండ్రి మోహన్‌బాబు నటించిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌‌గా సినీ రంగప్రవేశం చేశాడు. యువనటుడిగా దొంగ దొం

మంచు ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసిన మంచు మనోజ్ సినిమాలకు దూరం కానున్నాడు. తన తండ్రి మోహన్‌బాబు నటించిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌‌గా సినీ రంగప్రవేశం చేశాడు. యువనటుడిగా దొంగ దొంగది, శ్రీ, ప్రయాణం, మిస్టర్‌ నూకయ్య, వేదం తదితర సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
 
అయితే ప్రస్తుతం చేస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో పాటు, ఇప్పటికే అంగీకరించిన మరో సినిమా పూర్తి చేసిన అనంతరం ఇకపై ఎలాంటి సినిమాల్లో నటించనని ప్రకటించాడు. తన ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాన్ని మంచు మనోజ్ తెలిపాడు. అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అయితే మంచు మనోజ్ ఉన్నట్టుండి.. ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 
 
మంచు మనోజ్ కుటుంబంలో అందరూ సినీ నటులు కావడం విశేషం. తాజాగా మంచు లక్ష్మి రాజకీయాల్లోకి రానుందంటూ ప్రచారం జరిగింది. మంచులక్ష్మికి తోడుగా రాజకీయాల్లోకి వచ్చేందుకే మంచు మనోజ్ సినిమాలకు దూరం అవుతున్నాడని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.