శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (17:04 IST)

డీసీపీ బూటు కాలితో తన్నుతుంటే హారిక వెకిలి చేష్టలు చేస్తూ నవ్వింది...

లఘు చిత్ర దర్శకుడు యోగి మరోమారు నటి హారిక ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. తనను మాదాపూర్ అడిషినల్ డీసీపీ గంగిరెడ్డి బూటుకాలితో తన్నుతుంటే వెకిలి చేష్టలు చేస్తూ నవ్విందనీ, ఇదేమిటని ప్రశ్నించినందుకు డీస

లఘు చిత్ర దర్శకుడు యోగి మరోమారు నటి హారిక ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. తనను మాదాపూర్ అడిషినల్ డీసీపీ గంగిరెడ్డి బూటుకాలితో తన్నుతుంటే వెకిలి చేష్టలు చేస్తూ నవ్విందనీ, ఇదేమిటని ప్రశ్నించినందుకు డీసీపీ తనపై చేయి కూడా చేసున్నారనీ వాపోయారు. 
 
నటి హారికను వేధించిన కేసులో దర్శకుడు యోగిని పోలీసులు విచారణ పేరుతో స్టేషన్‌కి పిలిచి హేయంగా నడుచుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, యోగిని డీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నుతూ చెంపలు పగులగొడుతున్నట్టు ఉండే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
దీనిపై యోగి స్పందిస్తూ, హారికకు షార్ట్ ఫిల్మ్‌లో అవకాశం ఇస్తానని తాను చెప్పలేదని తెలిపాడు. అలాగే, తాను హారికను లైంగికంగా వేధించలేదని, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆమె వద్ద తీసుకున్న రూ.10 వేలు ఇవ్వనందుకే కేసు పెట్టిందని వివరించాడు. అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తనను కొడుతున్నప్పుడు వీడియో తీసింది హారికేనని చెప్పాడు. 
 
పోలీసులు తనను విచారిస్తున్నప్పుడు హారిక వెకిలి చేష్టలు చేస్తూ నవ్విందని, ఇదేంటి సార్ అని అడిగితే అడిషనల్ డీసీపీ కొట్టారని యోగి చెప్పాడు. పెళ్లి అయిన హారిక బడా ప్రొడ్యూసర్ కొడుకుతో ప్రేమలో పడిందని, ఆమె వ్యక్తిగత విషయాలు తనకు తెలిసినందుకే తనపై కేసు పెట్టిందని యోగి ఆరోపించాడు.