సామాజిక మాథ్యమాన్ని అలా వాడుకుంటానంటున్న శ్రద్థాకపూర్
సామాజిక సమస్యలపై స్పందించడానికి సోషల్ మీడియా ఓ వేదిక అంటోంది శ్రద్థాకపూర్. సామాజిక మాథ్యమాల్లో గాసిప్ లు, అనవసర వార్తలు మాత్రమే వస్తాయడానికి తాను అంగీకరించబోనటోంది. ఎవరైనా అలా మాట్లాడితే అస్సలు ఒప్పుకోవడం లేదు శ్రద్థాకపూర్.
ఎక్కడేం తప్పు జరిగినా తన అభిప్రాయాలను వెల్లడించడానికి ఇదో మంచి వేదిక అన్నది తన ఉద్దేశమంటోంది. సోషల్ మీడియాలో ప్రజలు చెడునే ఎక్కువగా చూస్తుంటారు. ప్రతికూల వార్తలే ఎక్కువ ప్రచారం జరుగుతుంటాయని అనుకుంటుంటారు. నేను మాత్రం అందులో మంచినే చూస్తా.
ఎవరు ఎలా అనుకుంటే అది అలా ఉంటుంది. ప్రతి విషయాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటేనే అది మనకు ఆరోగ్యకరం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలంటోంది శ్రద్థాకపూర్.