బికినీలో శివాత్మిక, శివాని.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ (video)
టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు... శివాని, దొరసాని ఫేమ్ శివాత్మిక ఇద్దరు కూడా సింగపూర్ వెళ్లారు. తన స్నేహితులతో కలిసి వీరంతా అక్కడ హైట్స్‌లో స్విమ్ చేస్తూ నానా హంగామా చేసారు.
ఇద్దరు భామలు బికినిలో తెగ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కొత్త సంవత్సరానికి ముందు విదేశాల్లో ట్రిప్పేయడం సెలెబ్రిటీలకు మామూలే. అక్కడ బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట పోస్టు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది.
తాజాగా రాజశేఖర్ కూతుళ్లిద్దరూ ఇలా బికినీతో కనిపించడం సంచలనం రేపింది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న సినిమాతో శివాని హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత మరో సినిమాకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మిక.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి చేసిన దొరసాని సినిమాతో పరిచయం అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేదు.
ప్రస్తుతం ఈమె కృష్ణవంశీ తెరెకెక్కిస్తున్న ''రంగమార్తాండ'' సినిమాలో కీ రోల్ పోషిస్తుంది. మరాఠీలో సూపర్ హిట్టయిన ఓ సినిమాను రంగమార్తాండగా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాడు కృష్ణవంశీ. ఇప్పటికే ఈ సినిమా కోసం కీ రోల్స్ లో బ్రహ్మానందం, అనసూయలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మరో కీలక పాత్ర కోసం రాజశేఖర్ కూతురు శివాత్మికను ఎంపిక చేశారు.