అమరావతి నగర నిర్మాణం ప్రాజెక్టు నుంచి సింగపూర్ కంపెనీ నిష్క్రమణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి నగర నిర్మాణ ప్రాజెక్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్టు సింగపూర్ కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని సింగపూర్ దేశ మంత్రి ఈశ్వరన్ స్వయంగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన పరస్పర అంగీకారం తర్వాత సింగపూర్ కన్సార్టియం ఈ ప్రాజెక్టుకు దూరం జరిగిందని ఆయన తెలిపారు. తాము తప్పుకున్న కారణంగా పెట్టుబడులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో తాము పెట్టే పెట్టుబడులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. ఇదే విషయమై సోమవారం రాత్ర వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారు సైతం ఉత్తర్వులు విడుదల చేస్తూ, అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం తప్పుకుందని తెలిపింది.