శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మే 2022 (09:27 IST)

సింగీతం శ్రీనివాసరావుకు సతీవియోగం

signeetam wife
ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన జీవిత సహచరిణి లక్ష్మీకళ్యాణం శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈమె అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో జరుగనున్నాయి. 1960లో సింగీతం శ్రీనివాసరావును వివాహం చేసుకున్న లక్ష్మీ కళ్యాణి ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. ఆమె తన పనులు చేసుకుంటూనే భర్తకు సినిమా స్క్రిప్టులు రాయడంలోనూ సహకరించేవారు. 
 
అయితే, కమర్షియల్ చిత్రాల హవా కొనసాగుతున్న తరుణంలో మాటలు, పాటలు లేకుండా "పుష్పక విమానం" చిత్రాన్ని తెరకెక్కించాలని తన భర్త సింగీతం భావించినపుడు అనేక మంది మంది నుంచి విమర్శలు వచ్చాయి. 
 
కానీ, ఈమె మాత్రం భర్తను వెన్నుతట్టి ప్రోత్సహించారు. అలాగే, తన జీవిత ప్రయాణం గురించి ఆమె "శ్రీకళ్యాణీయం" అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు.