శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (17:40 IST)

50 ఏళ్ల వయసులో గర్భం ధరించిన పాప్ స్టార్...జానెట్ జాక్సన్

ప్రఖ్యాత పాప్ స్టార్ జానెట్ జాక్సన్ (మైఖేల్ జాక్సన్ సోదరి) 50 ఏళ్ళ వయసులో ఆమె మొదటిసారి గర్భం దాల్చడంతో ఆనందం పట్టలేకుండా పోతుంది. తన భర్త విస్సామ్ అయ్ మానా తనకు మొదటిసారి బిడ్డ నిచ్చినందుకు సంతోషంగా

ప్రఖ్యాత పాప్ స్టార్ జానెట్ జాక్సన్ (మైఖేల్ జాక్సన్ సోదరి) 50 ఏళ్ళ వయసులో ఆమె మొదటిసారి గర్భం దాల్చడంతో ఆనందం పట్టలేకుండా పోతుంది. తన భర్త విస్సామ్ అయ్ మానా తనకు మొదటిసారి బిడ్డ నిచ్చినందుకు సంతోషంగా ఉందని ప్రకటించింది. 2010లో జానెట్ జాక్సన్, అయ్ మానాను పెళ్ళి చేసుకుంది. ప్రస్తుతం జాక్సన్‌కు 50 ఏళ్ళ వయసు వచ్చేసింది. అయితే ఇన్నేళ్ళ తర్వాత తనకు గర్భం రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ విషయంలో నిజంగా దేవుడికి ధన్యవాదాలు చెప్పాలంటూ పేర్కొంది.
 
అందుకు గుర్తుగా జాక్సన్ గర్భంతో ఉన్న ఓ చిత్రాన్ని పీపుల్స్ మ్యాగ్జిన్ ప్రచురించింది. నల్లని కళ్ళద్దాలతోపాటు, తెల్లని సూట్ ధరించి తన చేతిని పొట్టపై పెట్టుకున్న జానెట్ చిత్రం..అందర్నీ ఆకట్టుకుంటోంది. జానెట్ జాక్సన్... జేమ్స్ డీ బార్జేను 1984 లో పెళ్ళి చేసుకొని 1985 వరకు అతడితో కాపురం చేసి అనంతరం విడాకులు తీసుకుంది. 
 
అనంతరం రెనె ఎలిజోండో జూనియర్‌ను 1991 లో పెళ్ళి చేసుకొని 2000 సంవత్సరం వరకూ అతనితో కాపురం చేసి విడిపోయింది. చాలాకాలంగా ఒంటరిగా ఉండి 2010లో విస్సామ్‌ను వివాహమాడిన ఆమె.. ప్రస్తుతం అతడితో బిడ్డను కూడా కంటున్నట్లు స్పష్టం చేసింది. అయితే తనకు పుట్టబోయే బిడ్డకు పాప్ రారాజు దివంగత మైఖేల్ జాక్సన్ పేరు పెట్టుకుంటానని చెబుతోంది.