ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 1 జులై 2023 (16:48 IST)

సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ చిత్రం సర్కారు నౌకరి

Sarkaru Naukari, Akash
Sarkaru Naukari, Akash
దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ‘‘సర్కారు నౌకరి’’ అనే నూతన చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింగర్ సునీత తనయుడు ఆకాష్‌ ఈ సినిమాతో హీరోగా తెరకు పరిచయం కాబోతోన్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.
 
తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. సర్కారు నౌకరి అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మేకర్లు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో హీరో సైకిల్ మీద కనిపిస్తుండటం.. బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్టుకి ఓ డబ్బా వేలాడటం, దానిపై 'పెద్ద రోగం చిన్న ఉపాయం' అని రాసి ఉండటం ఇవన్నీ కూడా సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి.
 
హీరో ఆకాష్ కూడా ఎంతో సహజంగా కనిపిస్తున్నారు. ఒక్కడి ఆలోచనతోనే విప్లవం మొదలవుతుంది అని ఈ ఫస్ట్ లుక్‌తో మేకర్లు వదిలిన క్యాప్షన్ చూస్తుంటే సినిమాలో కథ ఎంతో లోతుగా, బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.
 
ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్,తనికెళ్ల భరణి,సూర్య,సాయి శ్రీనివాస్ వడ్లమాని,మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి,రమ్య పొందూరి,త్రినాథ్ నటీనటులు.