శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జులై 2023 (15:29 IST)

చలాన్ డౌన్ లోడ్‌లో కష్టాలు.. ఐటీ శాఖ ఒక కీలక ప్రకటన

aadhar-pan
ఆధార్‌ను పాన్ కార్డుతో లింక్ చేసుకునేందుకు గడువు జూన్ 30వ తేదీన ముగిసింది. ఈ నేపథ్యంలో జూన్ 30న ఆధార్ లింక్ కోసం ఆన్‌లైన్‌లో జనం ప్రజలు పోటెత్తారు. దీంతో చాలా మందికి చలాన్ పేమెంట్, డాక్యుమెంట్ల లింకింగ్‌లో సమస్యలు తలెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో అయితే ఐటీ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. చలాన్ డౌన్ లోడ్ చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది ఎదుర్కొన్నట్టు తమ దృష్టికి రావడంతో ఐటీ శాఖ స్పందించింది. పేమెంట్ పూర్తయినట్టు చూపిస్తే... ఆధార్, పాన్ లింక్ చేసుకోవచ్చని తెలిపింది. 
 
చెల్లింపు పూర్తయిన వారి రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు చలాన్‌కు సంబంధించిన రసీదు కాపీ వస్తుందని స్పష్టం చేసింది. ఆధార్, పాన్ లింక్ ప్రక్రియ పూర్తి కాకపోతే అలాంటి వాటిని ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. ప్రత్యేకంగా చలాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది.