pragathi: రెండో పెళ్లిపై ప్రగతి ఆసక్తికర కామెంట్స్.. కట్టుబాట్లు పెడితే నేను భరించలేను
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటూ, ఫిట్‌నెస్, జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్‌తో యువతకే షాక్ ఇస్తున్నారు. వయసు పెరుగుతున్నా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ప్రగతి ఎక్కడా రాజీ పడడం లేదు. గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేయడమే కాదు, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కూడా పాల్గొంటున్నారు.
ఈ ఏడాది ఇంటర్నేషన్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని రజతం సాధించారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ప్రగతికి వైవాహిక జీవితం అంత సాఫీగా సాగలేదని, భర్తతో విడాకులు తీసుకున్నానని తెలిపారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఒక తోడు అవసరమే. కానీ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయి ఉండాలి. తన మెచ్యూరిటీ లెవల్‌కు సరిపడే వ్యక్తి దొరకకపోతే మళ్లీ అదే కష్టమేనని ప్రగతి అన్నారు.
అలాగే, "పెళ్లయ్యాక నువ్వు ఇలా ఉండాలి, అలా చేయాలి అంటూ కట్టుబాట్లు పెడితే నేను భరించలేను. ఒకవేళ నేను 20 ఏళ్లు ఉంటే.. సర్దుబాటు అయ్యేదాన్ని, కానీ, ఇప్పుడు నా వయసు, నా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. పెళ్లిపై ప్రస్తుతం ఎలాంటి ఆశలు లేవు.." అని స్పష్టంగా చెప్పారు.