మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 19 సెప్టెంబరు 2016 (21:07 IST)

గాయకుడు ఏసుదాసు ముందే యాంకర్ ఝాన్సీ ఆ పని చేసింది... అందరూ షాక్...

యాంకర్లు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తుంటారు. అలా చూపించినప్పుడు తమ నోటి వెంట తప్పు పదాలు దొర్లిపోతాయి. ఒక్కసారి నోటి నుంచి ఆ పలుకు అడ్డదిడ్డంగా వచ్చేస్తే ఇక వెనక్కి తీసుకోలేం కదా. అది అలా నిలిచిపోతుంది. యాంకర్ ఝాన్సీ కూడా అలాంటి తప్పిదమే ఒకటి చేశ

యాంకర్లు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తుంటారు. అలా చూపించినప్పుడు తమ నోటి వెంట తప్పు పదాలు దొర్లిపోతాయి. ఒక్కసారి నోటి నుంచి ఆ పలుకు అడ్డదిడ్డంగా వచ్చేస్తే ఇక వెనక్కి తీసుకోలేం కదా. అది అలా నిలిచిపోతుంది. యాంకర్ ఝాన్సీ కూడా అలాంటి తప్పిదమే ఒకటి చేశారు. విషయం ఏంటయా అంటే... ప్రముఖ సినీ గాయకుడు ఏసుదాసుకు తిరుపతిలో సన్మాన కార్యక్రమం జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా యాంకర్ ఝాన్సీ వ్యవహరించారు. ఏసుదాసు గురించి చెపుతూ... 'అమర గాయకుడు ఏసుదాసు గారు' అని సంబోధించి అందరికీ షాకిచ్చింది. ఆ మాట విన్నవారంతా నివ్వెరపోయారు. యాంకర్ ఝాన్సీ మాత్రం తప్పు తెలుసుకున్నప్పటికీ తనదైన శైలిలో మాటల వాగ్ధాటిని అలా కొనసాగించేసారు.