ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (07:27 IST)

పింక్ డ్రెస్‌లో సితార‌ అదిరింది!

Sitara Gattamneni, pink dress
మ‌హేష్‌బాబు కుమార్తె సితార పింక్ డ్రెస్‌లో లుక్ ఇచ్చింది. వాలెంటైన్ డే సంద‌ర్భంగా త‌ను ఈ డ్రెస్‌లో  వున్న ఫొటోల‌ను పోస్ట్ చేసింది. సోష‌ల్‌మీడియాలో త‌ను చాలా యాక్టివ్‌గా వున్న సంగ‌తి తెలిసిందే. యూట్యూబ్‌కూడా పెట్టి త‌న స్నేహితుల‌తో చిట్‌చాట్‌తోపాటు త‌న త‌ల్లి న‌మ్ర‌త‌తో కొన్ని టిప్స్‌ను కూడా పోస్ట్ చేస్తుంటుంది. దీనికి మంచి ఆద‌ర‌ణ వ‌స్తోంది. అభిమానులు ఆమెతో చిట్‌చాట్ చేస్తుంటారు. ఒక‌వైపు చ‌దువుకొంటూనే మ‌రోవైపు ఇలాంటి సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా వుంటోంది. త‌న తండ్రి సినిమాల‌కు సంబంధించిన పాట‌లు పాడ‌డం, డ్యాన్స్‌లు చేయ‌డం వంటివి చేస్తూ అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంటుంది. తాజాగా సితార త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అప్పుడు ఎంత పెద్ద‌దిగా అయిపోయిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు పింక్‌డ్రెస్‌లో అదిరింది అంటూ కామెంట్ చేశారు.