మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2021 (22:27 IST)

దారుణం, కూతురికి పెళ్లయితే ఒంటరివాళ్లమవుతామని హత్య చేసిన తండ్రి

చంఢీగర్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో కుమార్తెకి పెళ్లి చేయాల్సి వుండగా ఆ కన్నకూతురునే పొట్టనబెట్టుకున్నాడో తండ్రి.
 
వివరాల్లోకి వెళితే.. లుధియానాలోని షేర్‌పూర్ కలాన్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు తన ఒక్కగానొక్క కుమార్తె పెళ్లిని నిశ్చయించాడు. ఆమె పెళ్లి వచ్చే 21వ తేదీని జరుగనుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి తన కుమార్తె, భార్యను అత్యంత పాశవికంగా సుత్తితో తలలపై మోది చంపేశాడు. వారిరువరూ చనిపోయారని నిర్థారించుకున్న తర్వాత అతడు కూడా వెళ్లి సమీపంలోని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
కాగా కుమార్తె పెళ్లి కుదిరిన దగ్గర్నుంచి ఆమెకి పెళ్లయితే మన గతేం కాను అంటుండేవాడట. ఆమె వెళ్లిపోతే జీవితం శూన్యమవుతుందని చెప్తుండేవాడని స్థానికులు వెల్లడించారు.