శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (17:12 IST)

దీక్షిత్ శెట్టి‌, శశి ఓదెల హీరోలుగా ఎస్.ఎల్.వి.సినిమాస్ చిత్రం

Dixit Shetty, Shashi Odela
Dixit Shetty, Shashi Odela
దీక్షిత్ శెట్టి‌, శశి ఓదెల హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.8 సినిమా రూపొందనుంది. కె.కె దర్శకత్వంలో సుధాకర్ చెెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశి ఓదెల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ స్టోరీతో 90వ దశకానికి చెందిన పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా సినిమా తెరకెక్కనుండటం విశేషం.
 
పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బన్నెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సహా మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
 
నిర్మాత - సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం - కె.కె, సినిమాటోగ్రఫీ - నగేష్ బన్నెల్, సంగీతం - పూర్ణాచంద్ర తేజస్వి, ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ - శ్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శేఖర్ యలమంచిలి, మార్కెటింగ్ - వాల్స్ అండ్ ట్రెండ్స్, బాలు ప్రకాష్ (స్టూడియో బ్లాక్), పి.ఆర్.ఒ - వంశీ కాకా.