1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2016 (10:25 IST)

నా కాళ్ల అందాన్ని చూసి 15 ప్రొడక్టులు కొనుగోలు చేస్తున్నారు : ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కాళ్ల అందాన్ని చూసి వినియోగదారులు 15 ప్రొడక్టులు కొనుగోలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కాళ్ల అందాన్ని చూసి వినియోగదారులు 15  ప్రొడక్టులు కొనుగోలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
'డబ్ల్యూ' మేగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ మిస్ వరల్డ్ బ్యూటీ, నేడు ఎందరో అమ్మాయిలు, యువతులు తాను ప్రచారం చేస్తున్న వివిధ బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేసింది. తన చిన్నప్పుడు మూడేళ్ల పాటు అమెరికాలో చదువుకున్న సమయంలో స్కూల్లో జాతి వివక్షకు కూడా గురయ్యానని వెల్లడించింది.
 
"నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు మగరాయుడిలా తిరిగేదాన్ని. నా కాళ్లేమీ అప్పట్లో అందంగా ఉండేవి కాదు. ఆ తర్వాత శరీరంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించాను. నేను చేసినట్టు ఎవరైనా చేయవచ్చు. ఇప్పుడు నా కాళ్లను చూసి 12 నుంచి 15 ప్రొడక్టుల వరకూ కొనుగోలు చేస్తున్నారు" అని ప్రియాంక అంది.