నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు.. రూ.లక్ష ఫసక్
విధి ఎలా ఉంటే అలా జరుగుతుందనుకోవాలో.. ఒక్కోసారి ఎంతటి వారానై బొక్క బోర్లా పడతారనుకోవాలో తెలీని పరిస్థితి. ఇదే స్థితి ఇప్పుడు ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు విషయంలో జరిగింది. నిర్మాత సురేష్ బాబుని ఓ కేటుగాడు వ్యాక్సిన్ పేరుతో బురిడీ కొట్టించి, లక్ష రూపాయలను నొక్కేశాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, కరోనా టీకా సరఫరా చేస్తానని లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేయమనడంతో అతడిని నమ్మి లక్ష రూపాయలు సురేష్ బాబు మేనేజర్.. సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాకి డబ్బును బదిలీ చేశాడు.
ఆ తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి, చివరికి మోసం జరిగిందని తెలుసుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.