శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (22:12 IST)

90స్‌ సినిమా.. వింటేజ్ లుక్‌లో మాస్ మహారాజ.. హీరోయిన్‌గా కేరళ కుట్టి?!

'కిక్' లాంటి చిత్రంతో మంచి రెస్పాన్స్ అందుకున్న రవితేజ నెక్ట్స్ కొత్త డైరెక్టర్‌తో పని చేయబోతున్నాడు. శరత్ మండవ ఆయన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అయితే, డెబ్యూటాంట్ డైరెక్టర్ రొటీన్‌కి భిన్నంగా పీరియడ్ డ్రామా ప్లాన్ చేశాడట. 
 
1990వ దశకం తొలినాళ్లలో జరిగిన ఒక యదార్థ ఘటన సినిమా కథకి ఆధారం అంటున్నారు. అందుకు తగ్గట్టే రవితేజ లుక్ కూడా మార్చబోతున్నాడట. అంటే, మాస్ మహారాజా ఫ్యాన్స్‌కి 90స్‌లోని వింటేజ్ లుక్‌తో కొత్త పీల్ కలగటం గ్యారెంటీ. రవితేజ, డైరెక్టర్ శరత్ మూవీ ఉగాదికి ప్రారంభమైంది. అయితే, ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని చెబుతున్నారు. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ బాణీలు సమకూర్చే పనిలో ఉన్నాడు. 
 
ఇక సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కేరళ కుట్టి రాజీషా విజయన్ హీరోయిన్‌గా కన్ ఫర్మ్ కావచ్చట. ధనుష్ నటించిన రీసెంట్ మూవీ 'కర్నన్'లో మలయాళ సుందరే కథానాయిక. చూడాలి మరి, కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్‌తో రవితేజ చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.