శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (10:02 IST)

ఈవెంట్‌ను మోసం చేసిన రజినీకాంత్ హీరోయిన్

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్ ఆర్గనైజర్‌ను మోసం చేసినందుకుగాను ఈ కేసు నమోదైంది. ఈ మోసం కేసులో సోనాక్షితో సహా మరో ఐదుగురు ఉన్నారు. 
 
యూపీలోని కాట్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమోద్ శర్మ అనే వ్యక్తి గత యేడాది నవంబరు నెలలో ఫిర్యాదు చేశారు. అందులో ఢిల్లీలో జరిగిన ఓ బహమతుల కార్యక్రమానికి సోనాక్షిసిన్హాను ఆహ్వానించామని, ఇందుకు ఓ కంపెనీకి రూ.34 లక్షలు అందజేశానని పేర్కొన్నారు. 
 
కానీ, ఆమె తమ కార్యక్రమానికి రాకపోగా, తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సోనాక్షిసిన్హా సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సోనాక్షి సిన్హా గతంలో రజినీకాంత్ సరసన లింగా చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.