శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (11:40 IST)

బఫెలో అంటావా... ముందు దాని స్పెల్లింగ్ నేర్చుకో.. బాలీవుడ్ బ్యూటీ సెటైర్

దబాంగ్ సినిమాతో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసి, బొద్దు బ్యూటీగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవల ఓ నెటిజన్‌కు ఇచ్చిన రిప్లై నెట్‌లో హాట్ టాపిక్ అయ్యింది. దబాంగ్ సినిమాలో కనిపించాక, ఆమె లావుగా ఉన్నట్లు చాలా వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల బాలీవుడ్‌లో నిర్మాత, నటుడిగా ఉన్న సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ చాట్ షోకు సోనాక్షి సిన్హా హాజరయ్యారు. 
 
ఆ చాట్ షోలో ఆమెకు నెటిజన్ల నుండి వచ్చిన కొన్ని కామెంట్లను స్క్రీన్‌పై చూపించగా, వాటిలో ఆమెను దున్నపోతు అన్న కామెంట్‌పై సోనాక్షి తీవ్రంగా స్పందించారు. నన్ను బఫెల్లో అంటే అన్నావు గానీ, ముందు దాని స్పెల్లింగ్ కరెక్ట్‌గా నేర్చుకో గురువా అంటూ సెటైర్ వేసారు.
 
నిరాహార దీక్ష చేయడం ద్వారా బరువు తగ్గమని మరో నెటిజన్ కామెంట్ చేయగా సోనాక్షి మరో కౌంటర్ వదిలారు. నేను బరువు తగ్గే విషయం గురించి అంతగా ఆలోచించకండి. నేను ఇంతకంటే గొప్ప పాత్రలు చేయలేను. మీకు తెలియని విషయం ఏమిటంటే.. నాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి, నటించడానికి లెక్కలేనన్ని అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సోనాక్షి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. 
 
దబాంగ్ సినిమాలో నటించేటప్పుడు సుమారు 30 కిలోల బరువు తగ్గాను. అప్పుడు నా ఆరోగ్యం కూడా అంతగా బాగాలేదు. దాన్ని కూడా లెక్క చేయకుండా సినిమా కోసం ఎంతో కష్టపడి 30 కిలోలు తగ్గినప్పటికీ నాపై దారుణంగా ట్రోల్‌లు చేసారని సోనాక్షి పేర్కొన్నారు.