శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (14:24 IST)

అయ్య బాబోయ్.. ఐపీఎల్ వచ్చేస్తోందా.. జడుసుకుంటున్న ఇషాంత్ శర్మ సతీమణి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ చెన్నైలో జరుగనుంది. దీంతో చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌పై ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోటి రూపాయలకు వేలం ద్వారా కొనుగోలు చేసింది. 
 
ఈ నేపథ్యంలో.. ఇషాంత్ శర్మ సతీమణి ప్రతిమా సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో.. ఓ ఫ్యాన్ ఈ మ్యాచ్‌ టిక్కెట్లు కావాలని వేధించాడని.. ప్రపంచమే ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే.. సంతోషంగా వుంటుందని.. కానీ తమకు ఇలాంటి వారితో భయమేస్తుందని వెల్లడించింది. 
 
ఇంకా అయ్యబాబోయ్ ఐపీఎల్ వచ్చేస్తుందా.. అని భయపడిన సందర్భాలున్నాయని ఇషాంత్ సతీమణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఆమె పోస్టు చేసిన పోస్టు వైరల్ అవుతోంది. తన ఫాలోవర్స్ ఐపీఎల్ టిక్కెట్ల కోసం ట్రోల్ చేస్తున్నారని.. తాను ఐపీఎల్ టిక్కెట్లను పేటీఎమ్‌లో పొందాల్సిన సూచిస్తున్నానని చెప్పింది.