ముంబై జుహూ వీధిలో భిక్షమెత్తిన సింగర్ సోనూ నిగమ్.. ఎందుకు... ఎవరికోసం?
సోనూ నిగమ్.. దేశంలో మంచిపేరున్న గొప్ప సింగర్.. అతను పాట పాడారంటే ప్రేక్షకులు కాలు కదపాల్సిందే. అంత డిమాండ్ ఉన్న ప్లేబాక్ సింగర్ సోనూ నిగమ్... తనకు తానుగా ఆడియెన్స్ ముందుకొచ్చి వీనుల విందైన పాటలు పాడి సంగీత ప్రియులను సంగీతసాగరంలో ముంచెత్తుతాడు. అలాంటి సింగర్ ఉన్నట్టుండి ఓ బిచ్చగాడిగా మారాడంటే నమ్ముతారా... నిజం ఇది నమ్మితీరాల్సందే.
హార్మోనియం పెట్టేను చేత పట్టుకుని పాటలు పాడుతూ రోడ్డు మీద అడుక్కుంటూ తిరిగాడు. ఇదంతా నిజం కాదండోయ్ ఓ డిజిటల్ ఛానల్ కోసం ఇలా వెరైటీగా వీడియో షూట్ చేశాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు అచ్చం బిచ్చగాడిలా మేకప్ వేసుకున్న సోనూ.. రోడ్డులో హార్మోనియమ్ వాయిస్తూ పాటలు పాడాడు. అటుగా వెళ్తున్న బాటసారులెవ్వరూ ఆ సింగర్‌ను గుర్తు పట్టలేకపోయారు.
ముంబైలోని జూహూ వీధిలో ఈ వీడియో షూట్‌ని తీశారు. ఈ వీడియోకు ''ద రోడ్‌సైడ్ వస్తాద్'' టైటిల్‌ను ఖరారు చేశారు. రోడ్డు మీద సోనూ పాటలు విన్న కొందరూ ఆయనకు చిల్లర కూడా వేశారు. ఓ వ్యక్తి రూ.12 ఇచ్చి భోంచేయమన్నాడు కూడా. తాను పుట్టినప్పుడు తన తల్లితండ్రులు తెచ్చిన హార్మోనియమ్‌తో సోనూ వీధికెళ్లి అడుక్కోవడం విశేషం.