బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (15:58 IST)

గ్రామానికి నీరందించిన సోనూసూద్

Sonusood, UP village
బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన పరోపకార పని కారణంగా బాగా వెలుగులోకి వచ్చాడు, ఇటీవల ఒక గ్రామంలో నీరు లేదని ఆందోళనతో ఒక వ్యక్తి సంప్రదించిన తరువాత యు.పి.లోనిఝాన్సీ ప్రాంతంలోని ఒక గ్రామానికి మద్దతునిచ్చాడు. అక్క‌డ జితేంద్ర అనే వ్య‌క్తి సోష‌ల్‌మీడియాలో సోనూకు వివ‌రాలు తెలియ‌జేయ‌డంతో బోరింగ్‌లు వేయించారు.

సోనూసూద్ మాట్లాడుతూ, అక్క‌డి యువ‌త త‌మ‌కు నీరు స‌రిగ్గా అందుబాటులో లేద‌ని అడిగారు. కుటుంబంలోని పిల్లలు నిజంగా బాధపడుతున్నారు. వారు నీరు పొందడానికి కిలోమీటర్లు నడవవలసి వచ్చింది.

కాబట్టి మేము అక్కడ హ్యాండ్ పంపులను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్ప‌గానే వారు ఆనందించారు. వారికి చెప్పిన‌ట్లుగా చేతిపంపులు వేసి అంద‌రికీ నీరు వ‌చ్చేలా చేశాం. ఇందుకు వారు కృత‌జ్ఞ‌త‌లు తెలిపార‌ని` సోష‌ల్‌మీడియాలో సోనూసూద్ తెలిపారు. ఇలాంటివి చేస్తున్న‌ప్పుడు మా అమ్మ ఆశ‌యం నెర‌వేర్చినందుకు చాలా ఆనందంగా వున్నాన‌ని వెల్ల‌డించారు.