శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (15:15 IST)

ఐపీఎస్ అధికారులు చిందేస్తే ఇలా వుంటుంది.. (వీడియో)

IAS-IPS officer
సాధారణంగా ఐపీఎస్‌ అధికారులు సీరియస్‌గా కనిపిస్తారు. అలాంటిది ఐపీఎస్ అధికారులు ఏకంగా డ్యాన్స్ చేస్తే ఎలాంటి ఉంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా..? తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీలో ఓ పార్టీకి హాజరైన ఇద్దరు ఐపీఎస్ అధికారులు సింగర్‌ సప్న చౌదరి పాటకు స్టెప్పులు వేసి పార్టీలో ఉన్నవారిని ఉత్సాహపరిచారు. 
 
ప్రస్తుతం వారి డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వీడియోను చూసిన నెటిజన్‌లు అధికారుల డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎస్‌ అధికారులు ఆర్కే విజ్‌, దిపాన్షు కబ్రాలు ఇటీవల ఢిల్లీలో ఓ పార్టీకి వెళ్లారు. ఆ పార్టీలో సప్న చౌదరి పాడిన 'గజ్బాన్‌ పానీ లే చలి' అనే పాటకు వీరిద్దరూ కలిసి స్టెప్పులేశారు.
 
వారి డ్యాన్స్ వీడియోను డాక్టర్ మోనికాసింగ్‌ అనే మహిళ శనివారం ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఎస్పీ మహోదయ్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ మహోదయ్‌.. సూపర్‌' అంటూ ఆమె ట్వీట్‌ చేసింది. ఇప్పటివరకు వీడియోకు 40 వేలకు పైగా వ్యూస్‌, వేలల్లో కామెంట్‌లు వచ్చాయి.
 
అద్భుతమైన డ్యాన్స్‌.. సూపర్ స్టెప్పులు అంటూ నెటిజన్‌లు వారిని మెచ్చుకుంటున్నారు. విధుల్లో లేనప్పుడు వారు కూడా సాధారణ పౌరులే.. అందరిలాగే వాళ్లకు కూడా సరదాగా గడిపే హక్కు ఉంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.