గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 27 ఫిబ్రవరి 2021 (15:10 IST)

నా హద్దులేంటో నాకు తెలుసు, పెంపుడు తల్లి చెబితే వినాలా?

వరలక్ష్మి. విలన్‌గా హీరోయిన్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అలాగే శరత్ కుమార్ కుమార్తెగా కూడా ఈమె అందరికీ బాగా పరిచయమే. వినూత్నమైన  కథాకథనంతో.. వెరైటీ సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు వరలక్ష్మి. అయితే ఈమె తల్లి ఎవరన్నది చాలామందికి ఇప్పటికీ తెలియదు. 
 
ప్రముఖ సినీనటి రాధికే వరలక్ష్మి తల్లి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే వరలక్ష్మి తల్లి ఛాయ శరత్ కుమార్. సినిమా ఫీల్డుతో సంబంధం లేకపోయినా శరత్ కుమార్ ఈమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అయితే తండ్రి ప్రోత్సాహం ఏమాత్రం లేకుండా నేరుగా తన టాలెంట్‌తో సినిమాల్లోకి వచ్చారు వరలక్ష్మి.
 
అయితే ఈ మధ్య రాధిక గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. నేను సినిమాల్లో ఎలా నటించాలో నాకు తెలుసు. అంతేకాదు నా హద్దులు నాకు తెలుసు. నా పెంపుడు తల్లి రాధికలా చీరలే కట్టుకోవాలి.. శరీరం ఫుల్లుగా కప్పుకునే విధంగా దుస్తులు ఉండాలి అలాంటివి నేను పట్టించుకోను. అంతా నా ఇష్టం అంటూ చెప్పుకొస్తోంది వరలక్ష్మి. ఈమె వ్యాఖ్యలతో రాధిక అభిమానులు మండిపడుతున్నారు.