శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 6 జులై 2020 (14:13 IST)

చిరు మూవీలో విజయ్ దేవరకొండ..?

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తర్వాత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీగా సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు. ఈ సినిమా తర్వాత ఆచార్య చేస్తున్నారు. బ్లాక్‌బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
 
ఇందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత లూసీఫర్ రీమేక్‌లో నటించేందుకు చిరు ఓకే చెప్పారు. మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ రీమేక్ హక్కులను రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ కోసం సుహాసిని, ఖుష్బూలను పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఇంకా ఎవర్నీ ఖరారు చేయలేదు.
 
ఇదిలావుంటే.. ఇప్పుడు ఈ సినిమాలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. లూసిఫర్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర చేసారు. ఆ పాత్ర కోసం చిత్రయూనిట్ విజయ్ దేవరకొండను సంప్రదించినట్లుగా తెలిసింది. చిరు మూవీలో విజయ్ దేవరకొండ జరిగితే.. ఈ ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్ రావడం ఖాయం.