మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (08:35 IST)

సోషల్ మీడియాకు షేక్ చేస్తున్న శ్రద్ధ... స్విమ్ షూట్‌ ఫోటోలు వైరల్

చిత్రసీమలో ఉన్న హీరోయిన్లలో శ్రద్ధా దాస్ ఒకరు. ఈమె ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్విమ్ షూట్‌లో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇపుడు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలకు నెటిజన్లు తెగ లైకులు ఇచ్చేస్తున్నారు. 
 
వాస్తవానికి టాలీవుడ్ సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు తప్పితే.. ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్రలు మాత్రం ఆమెను వరించలేదు. దీంతో ఈ భామ తన గ్లామర్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేసి, అక్కడ అవకాశాలు పట్టేసింది. 
 
బాలీవుడ్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అంటూ బిజీగానే గడుపుతుందీ భామ. బాలీవుడ్‌లో బిజీగా ఉన్నా, తన గ్లామర్ పవర్ తగ్గలేదనే విషయం తెలిసేలా హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాని శ్రద్ధా షేక్ చేస్తోంది. 
 
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రద్ధా దాస్, తను కొత్తగా ఏం చేసినా తన అభిమానులతో షేర్ చేస్తూ, వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది. తాజాగా ఈ భామ తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశాలలో మరో ప్రదేశాన్ని కనుగొన్నానని తెలుపుతూ గోవాలో స్విమ్ షూట్‌లో ఉన్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.