మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By

బిగ్ బాస్ హౌస్‌లోకి హాట్ యాక్ట్రెస్ ఎంట్రీ?

బిగ్ బాస్ హౌస్ -3లోకి హాట్ యాక్ట్రెస్ ఒకరు ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన ఈ రియాల్టీ షోలో మొత్తం 15 మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో ఒకరు బయటకు వెళ్లనున్నారు. దీంతో కొత్తవారికి ఛాన్స్ లభించనుంది. ఇలాంటివారిలో హాట్ యాక్ట్రెస్ ఒకరు ఉండనున్నారు. 
 
"సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం" సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి శ్రద్ధా ధాస్. ఈ అమ్మడు 'ఆర్య2', 'గుంటూరు టాకీస్', 'గరుడ వేగ' వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్ద ప్రాజెక్టులు ఏమి లేవు. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా వారం రోజుల పూర్తి చేసుకోవ‌డంతో ఈ రోజు ఒక‌రు హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. 
 
ఇప్పటికే గొడవలు, గ్యాంగులతో హౌజ్‌లో వేడి రాజుకుంది. ఇదే టైంలో మరింత గ్లామర్ టచ్ ఆడియెన్స్‌కు ఇవ్వాలని బిగ్ బాస్ టీం భావిస్తోంది. ఎలిమినేష‌న్  త‌ర్వాత శ్ర‌ద్ధా దాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెడుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక ట్రాన్స్‌జండర్ తమన్నా సింహాద్రి కూడా ఎంట్రీ ఇవ్వనుందంటూ మరికొన్ని రూమర్స్‌ షికారు చేస్తున్నాయి. మ‌రి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.