శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 6 ఏప్రియల్ 2017 (19:58 IST)

మెగాస్టార్ చిరంజీవి అభిమానికి ఎస్పీ బాలు సూపర్ కౌంటర్... ఏంటది?

ఈమధ్య ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వార్తల్లో తిరుగుతున్నారు. ఇళయరాజా గొడవ వల్ల అలా జరిగిపోయింది. కానీ తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమాని ఎస్పీబిని ఉద్దేశించి ఓ కామెంట్ చేసాడు. మిమ్మల్ని చిరంజీవి.. బాలు గారూ... అని సంబోధిస్తుంటే మీరేమో అలాక్కా

ఈమధ్య ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వార్తల్లో తిరుగుతున్నారు. ఇళయరాజా గొడవ వల్ల అలా జరిగిపోయింది. కానీ తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమాని ఎస్పీబిని ఉద్దేశించి ఓ కామెంట్ చేసాడు. మిమ్మల్ని చిరంజీవి.. బాలు గారూ... అని సంబోధిస్తుంటే మీరేమో అలాక్కాదు నన్ను అన్నయ్యా అని పిలువమని చెపుతున్నారు. చిరంజీవి నుంచి మీరు ఎందుకంత గౌరవం కోరుకుంటున్నారు అని కామెంట్ పెట్టారు. 
 
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దీనిపై స్పందిస్తూ... చిరంజీవి తనను మొదటి నుంచీ అన్నయ్యా అని ఆప్యాయంగా పిలిచేవారనీ, కానీ ఈమధ్యనే బాలు గారూ అంటూ పిలుస్తారని పేర్కొన్నారు. ఎప్పటినుంచో అన్నయ్యా అని పిలిచే చిరు... ఇప్పుడు కొత్తగా బాలూ గారూ అని పిలువడం ఎందుకని అన్నయ్యా అని పిలువమని చెప్పానని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై చూసిన చిరు అభిమానికి ఎస్పీబీకి క్షమాపణలు చెప్పారు.