మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (08:06 IST)

కామెంట్లను పట్టించుకుంటే ఇక పనిచేసినట్లే.. ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకొచ్చినట్లే అంటున్న శ్రుతి

ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకి రాలేం. అందుకే ప్రశంసలను ఆశించను. ఇతరుల నుంచి ప్రశంసలు ఆశిస్తేనే ప్రాబ్లమ్‌ అంటున్నారు తెలుగు, తమిళ చిత్రసీమల్లో అగ్ర హీరోయిన్ శ్రుతి హసన్. విమర్శలను కూడా లైట్‌ తీసుకోవడానికే ప్రయత్నించకపోతే ఏ మూల ఏ కాస్త అపనింద వ

ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకి రాలేం. అందుకే ప్రశంసలను ఆశించను. ఇతరుల నుంచి ప్రశంసలు ఆశిస్తేనే ప్రాబ్లమ్‌ అంటున్నారు తెలుగు, తమిళ చిత్రసీమల్లో అగ్ర హీరోయిన్ శ్రుతి హసన్. విమర్శలను కూడా లైట్‌ తీసుకోవడానికే ప్రయత్నించకపోతే ఏ మూల ఏ కాస్త అపనింద వచ్చినా ఏడుస్తూ కూచోవడమే తప్ప మరేమీ చేయలేమంటున్నారీ కమల హసన్ గారాల తనయ. కాటమరాయుడు సినిమాలో పవన్ కల్యాణ్ సరనస హీరోయిన్‌గా నటిస్తున్న శ్రుతి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్లను పట్టించుకుంటే ఇక పనిచేసినట్లే అనేశారు.
 
జీవితం పట్ల నిర్దిష్ట అభిప్రాయాలు కలిగి ఉన్న శ్రుతిహసన్ మాటల్లో కొన్ని...
 
కామెంట్స్‌ తీసుకోదగ్గవి అయితే తీసుకుంటాను. టైమ్‌పాస్‌ కోసం మాట్లాడుతున్నారనిపిస్తే... మనసుకి ఎక్కించుకోను. పట్టించుకుంటే నా పని మీద దృష్టి పెట్టలేను. ‘డౌన్‌’ అయిపోతాను. ఒకర్ని ‘డౌన్‌’ చేయడం ద్వారా తాము ‘అప్‌’ అవుతామనుకునేవాళ్లు ఏదేదో మాట్లాడతారు. ఆ మాటలను నెగటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా తీసుకుంటే మనకు మంచిది. మన పని మనం బాగా చేయగలుగుతాం.
 
ప్రపంచాన్ని చూడండి. ఏం జరుగుతుందో తెలుసుకోండి. భారతదేశంలోనే కాదు.. అమెరికాలోనూ ఆడవాళ్ల గురించి ఎలా మాట్లాడుతున్నారో వినండి. శారీరక బలంకన్నా మానసికం బలం గొప్పది. అందుకే అంటున్నా... ‘బీ స్ట్రాంగ్‌’. అలాగని ఎగబడి ఎవర్నీ తిట్టమనడంలేదు.. కొట్టమనడంలేదు. మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించడం కోసం బలంగా ఉండాలి.
 
ఈ మధ్య నాలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే... ఏ విషయం గురించైనా క్లియర్‌గా ఆలోచించిస్తున్నాను. నాకేం కావాలో, ఏం అక్కర్లేదో స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నా. ‘మనం ఈ మాట మాట్లాడితే ఎవరైనా హర్ట్‌ అవుతారేమో’ అనే ఫీలింగ్‌తో నా మనసులోని మాటలను చెప్పేదాన్ని కాదు. కానీ, ఇప్పుడు మనం అబద్ధం ఆడనంతవరకూ, నిజాయితీగా ఉన్నంతవరకూ మన మనసుకి అనిపించిన మాటలు మాట్లాడాలని ఫిక్స్‌ అయ్యాను. అయితే నా మాటలు ఎవర్నీ బాధపెట్టకుండా జాగ్రత్తపడుతున్నా.
 
సక్సెస్‌ అనేది నాకు ఈజీగా రాలేదు. చాలా స్లోగా వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీని చేసింది. చేతినిండా పని ఉంది.  చేసే పనిని కష్టంగా ఫీలైతే బోర్‌ ఏంటి.. అలసట కూడా అనిపిస్తుంది. రెండేళ్ల క్రితం నేను ఏడు సినిమాలు చేశాను. పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆలోచించుకునే తీరికే లేకుండాపోయింది. అయినా బాగానే అనిపించింది. ఎందుకంటే, టాలెంట్‌ ఉండి కూడా సరైన ఛాన్స్‌ దక్కనివాళ్లు ఉన్నారు.