మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 జనవరి 2018 (10:39 IST)

'అజ్ఞాతవాసి'ని చూడనున్న మెగా ఫ్యామిలీ .. 8న స్పెషల్ స్క్రీనింగ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే, ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీ విడుదలకు ముందు తిలకించనుంద

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే, ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీ విడుదలకు ముందు తిలకించనుంది. ఇందుకోసం ఈనెల 8 లేదా 9 తేదీల్లో స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. 
 
ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మెగా కుటుంబం కోసం సినిమా విడుదలయ్యే రెండు రోజుల ముందు 'అజ్ఞాతవాసి' ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. దాంతో మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమా చూశాక ఆయన స్పందన ఎలా ఉంటుందోనని మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
 
ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ తన సొంత నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటించారు. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ, ఆది పినిశెట్టి, మురళీ శర్మ సహాయ పాత్రలు పోషించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత బాణీలు సమకూర్చారు.