1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2023 (11:08 IST)

గురువు శ్రీ రామోజీ రావు గారి ఆశీర్వాదం తీసుకున్న సీనియర్ నరేష్

naresh-Ramojirao
naresh-Ramojirao
సినీరంగంలో తన 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, నటుడు సీనియర్ నరేష్ ఇటీవలే తన భార్య పవిత్ర లోకేష్ తో విదేశాల్లో హాయిగా గడిపి వచ్చిన ఆయన నేడు రామోజీరావుగారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా గురువు శ్రీ రామోజీ రావు గారిని కలుసుకుని, ఆయన ఆశీర్వాదం తీసుకుని, హృదయపూర్వకంగా సంభాషించానని తెలిపారు.
 
సినిమా నటుడిగా రామోజీరావు నిర్మాతగా నాలుగు స్తంభాలాటలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత వారి బేనర్ లో పలు సినిమాలు చేశారు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ విజయనిర్మలగారు స్థాపించిన స్టూడియో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు నవీన్ సినిమారంగంలో ఎడిటర్ గా, నటుడిగా రాణిస్తున్నాడు. త్వరలో టీవీ నిర్మాణంలో రాబోతున్నట్లు తెలుస్తోంది.