శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2023 (17:47 IST)

కూతురు కోసం భావోద్వేగాలను ఆపుకున్న పాత్రలో విక్టరీ వెంకటేష్

Venkatesh, shraddha Srinath
Venkatesh, shraddha Srinath
విక్టరీ వెంకటేష్  ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘సైంధవ్‌’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఊహించని థ్రిల్స్‌తో కూడిన ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు మంచి భావోద్వేగాలను కూడా వున్నాయి. తండ్రీకూతుళ్ల బంధం సినిమాకు మెయిన్ యుఎస్పీ. కొన్ని రోజుల క్రితం విడుదలైన రెండవ సింగిల్  హీరో కుటుంబంలోని ఆనందాన్ని చూపించింది. ఇప్పుడు విడుదలైన మూడో సింగిల్ ‘బుజ్జికొండవే’ తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మరో షేడ్ ప్రజెంట్ చేస్తోంది.  
 
వెంకటేష్ కూతురికి హెల్త్ ఇష్యూ వుంటుంది, దీంతో ప్రతి తండ్రిలాగే వెంకటేష్ కూడా పెయిన్ ఫుల్ సిస్ట్యువేషన్స్  ఎదుర్కొంటున్నారు. అయితే తన కూతురిని భావోద్వేగానికి గురి చేయకుండా, తన ఎమోషన్స్ ని దాచిపెతాడు. శ్రద్ధా శ్రీనాథ్ ఈ ఎమోషనల్ జర్నీ భాగం కావడం మరింతగా మనసుని కలిదిస్తుంది. ఆమె పాపకి తల్లి కానప్పటికీ, తన సొంత కూతురిలా చూసుకుంటుంది.
 
ఈ సిస్ట్యువేషన్ కి తగినట్లు సంతోష్‌ నారాయణన్‌ అద్భుతమైన ట్యూన్‌ని అందించారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి తన అద్భుతమైన లిరిక్స్ సన్నివేశాన్ని మనసుని హత్తుకునేలా చెప్పారు ఎస్పీ చరణ్ తన మ్యాజికల్ వాయిస్ తో భావోద్వేగాలకు మరింత లోతును జోడించారు.
 
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.
 
సైంధవ్ జనవరి 13, 2024న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో విడుదల కానుంది.
 
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్