సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (15:09 IST)

లవ్యూ ఆల్... పిచ్చెక్కిపోతోందంటూ రాములమ్మ వీడియో..

బిగ్ బాస్ సీజన్ 3ని విజయవంతంగా ముగించుకుని రన్నరప్‌గా నిలిచిన యాంకర్ శ్రీముఖి ఇంటికి వచ్చిన తర్వాత అభిమానులతో ఓ వీడియోను పంచుకుంది. ఈ వీడియో ద్వారా అభిమానుల గురించి మాట్లాడుతూ వారి ఆదరణకు పిచ్చెక్కిపోతోందని చెప్పి షాకిచ్చింది శ్రీముఖి. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడానికి వెళ్లిన శ్రీముఖి 100 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంది. 
 
తన షోలు, యాంకరింగ్, యాక్టింగ్ అన్నీ పక్కన పెట్టి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఫైనల్‌గా విజేతగా నిలుస్తుందని భావించిన శ్రీముఖి రన్నరప్‌గా మిగిలిపోవడంలో చాలామంది షాకయ్యారు. ఇక శ్రీముఖి తాను రన్నరప్ గెలుచుకున్నందుకు సంతోషంగా ఉన్నానంటూ ఇంట్లోవారితో కలిసి పార్టీ చేసుకుంది. ఆ తర్వాత అభిమానులకు రిలీజ్ చేసిన వీడియోలో ఏముందంటే..
 
''అందరికీ నమస్కారం.. ఫైనల్లీ నా రొటీన్ లైఫ్‌లోకి వచ్చేశా. నాకు ఓటు వేసి, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు. చాలా వీడియోలు చూశాను, పిచ్చెక్కిపోతోంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. నార్మల్ ప్రపంచానికి వచ్చాక, మీ అందరినీ కలవాలని ఉన్నప్పటికీ, అందరినీ కలవడం కొంచెం కష్టం కావొచ్చు'' అని వీడియోలో పేర్కొంది శ్రీముఖి.