మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (10:55 IST)

పవన్‌ని 'అన్నా' అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా : సినీ నటి శ్రీరెడ్డి

జనసేన పార్టీ అధినేత, అగ్ర హీరో పవన్ కల్యాణ్‌పై మహిళా నటి శ్రీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ అంశంపై రెండో రోజూ చర్చా కార్యక్రమం నిర్వహించారు.

జనసేన పార్టీ అధినేత, అగ్ర హీరో పవన్ కల్యాణ్‌పై మహిళా నటి శ్రీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ అంశంపై రెండో రోజూ చర్చా కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఒక్కొక్కళ్ల జాతకాలు బయటకొచ్చినప్పుడు హీరోలకు సంబంధించిన అభిమానులు దయచేసి మమ్మల్ని వేధింపులకు గురి చేయొద్దని ప్రాధేయపడ్డారు.
 
ముఖ్యంగా పవన్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, నువ్వు ప్రజానాయకుడివి అయి ఉండి ఏం మాట్లాడుతున్నావు? నాకు అన్యాయం జ‌రిగింది అని చెబితే  పోలీస్ స్టేషన్‍కు వెళ్లమని చెబుతున్నావు? నువ్వు చెప్పాలి నాకు సలహా... పవన్ కళ్యాణ్‌ను 'అన్నా' అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా. ఇక పై పవన్ కళ్యాణ్‌ని ఏ అమ్మాయి కూడా అన్న అనొద్దు.. అంటూ చాలా అస‌భ్యంగా ఉండే రాయ‌డానికి వీలులేని భాషలో పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మ‌రి... ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో? చూడాలన్నారు.