శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 8 జూన్ 2017 (22:42 IST)

దాసరికి నివాళులు చెప్పేందుకు శ్రీదేవికి రెమ్యూనరేషన్ కావాలా...?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండ్ దర్శకరత్న దాసరి నారాయణ రావు చనిపోతే ఆయనకు సంతాపం ప్రకటించడంలో తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు కొందరు పట్టింపులేని ధోరణితో వున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అలనాటి నటి శ్రీదేవి దాసరి దర్శకత్వంలో ఓ వెలుగు వె

టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండ్ దర్శకరత్న దాసరి నారాయణ రావు చనిపోతే ఆయనకు సంతాపం ప్రకటించడంలో తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు కొందరు పట్టింపులేని ధోరణితో వున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అలనాటి నటి శ్రీదేవి దాసరి దర్శకత్వంలో ఓ వెలుగు వెలిగింది. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం వంటి హిట్ చిత్రాలతో ఆమె దశ తిరిగింది. 
 
ఐతే దాసరి స్వర్గస్తులయ్యాక ఆమె కనీసం దాసరికి నివాళులు అర్పించడం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన దాసరి పట్ల ఆమె ఇలానేనా ప్రవర్తించేది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు...తన తాజా చిత్రం మామ్ కోసం ఆమె తెగ ఆరాటపడుతూ సోషల్ మీడియాలో హంగామా చేసింది కానీ... దాసరి మృతిపై ఒక్క ట్వీట్ కూడా చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. శ్రీదేవి వంటి ఇతర సీనియర్ తారలు కూడా ఇలాగే ప్రవర్తించడం బాధాకరం అని టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ జనం అనుకుంటున్నారు.