శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (17:57 IST)

SSMB28:ఆగస్టు 11న గ్రాండ్ రిలీజ్.. భారీ అంచనాలు

Mahesh Babu
జనవరి 18న ఎస్ఎస్ఎంబీ28 షూటింగ్ పునఃప్రారంభం కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 11న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల తేదీ కంటే ముందే షూటింగ్‌ను సాఫీగా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు.
 
గత నెలలో మేకర్స్ మాట్లాడుతూ "మంచి స్పిరిట్, గొప్ప ఎనర్జీతో #SSMB28 జనవరి నుండి నాన్ స్టాప్‌గా సెట్స్‌పైకి వెళ్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ త్వరలో రిలీజ్ కానుంది. 
 
ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్, పీఎస్ వినోద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మహేష్ ఇటీవల వెకేషన్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లాడు.