1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (13:14 IST)

తెలుగు బిగ్ బాస్-6లో సామాన్యులకు ఆహ్వానం

biggboss5
బుల్లితెరపై ప్రేక్షకులను అమితంగా ఆకర్షించిన బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పటివరకు ఐదు సీజన్లు ముగిసిపోయాయి. త్వరలోనే ఆరో సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు వచ్చిన ఐదు సీజన్‌లలో బుల్లితెర, బిగ్ స్క్రీన్‌కు చెందిన సినీ సెలెబ్రిటీలకు అవకాశం కల్పించారు. కానీ, ఈ ఆరో సీజన్‌లో మాత్రం సామాన్యులకు అవకాశం కల్పించనున్నారు. 
 
అలాగే, ఈ ఆరో సీజన్‌లో యాంకర్ శివ, శ్రీరాపాక వంటి పలువురు కంటెస్టెంట్లు పాల్గొంటారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ దఫా సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టవచ్చు. ఈ మేరకు నిర్వాహకులు ఓ ప్రోమో కూడాను విడుదల చేశారు. 
 
ఈ ప్రోమోలో హీరో నాగార్జున మాట్లాడుతూ, బిగ్ బాస్ ఆరో సీజన్‌లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం. ఇన్నాళ్ళు మీరు బిగ్ బాస్‌ షోను చూశారు. ఆనందించారు. ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కదా... అందుకే స్టార్ మా అందిస్తుంది. అవకాశాన్ని అందుకు సువర్ణావకాశం. వన్ టైం గోల్డెన్ ఛాన్స్.. టిక్కెట్ టు బిగ్ బాస్ సీజన్ 6. మరిన్ని వివరాల కోసం స్టార్ మా వారి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవండి అని చెప్పుకొచ్చారు. మరి మీరు కూడా బిగ్ బాస్ హౌస్‌కు వెళ్ళాలని ఉంటే వెంటనే స్టార్‌మా.స్టార్‌టీ.కామ్ అనే వెబ్‌సైట్‌లో మీ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.