సంబంధిత వార్తలు
- అది భయానకం..ప్రశాంతంగా ఉండాలి.. ఇదే మొదటి, చివరి అనుభవం కావాలి: పీవీ సింధు
- కర్నాటకకు రావడం అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చినట్టుగా ఉంది : జూనియర్ ఎన్టీఆర్
- ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ- లక్ష్యసేన్ శుభారంభం
- ఆప్ఘన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. తగలబడిపోతున్న కాబూల్
- మారువేషంలో గుంటూరు జిల్లా కలెక్టర్, విదిలించి కొట్టిన ఆసుపత్రి సిబ్బంది
గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81
జిల్లా కేంద్రమైన గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81 అనే పేరుతో సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. 4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్‌లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 నూతన థియేటర్ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆహ్లాదమే ముఖ్యమైన అంశంగా స్టూడియో 81 థియేటర్లను సిద్ధం చేసిందన్నారు. మొత్తం ఐదు స్క్రీన్ లలో 849 సీట్ల కెపాసిటీతో అధునాతన హంగులతో నగర ప్రజలకు థియేటర్ అందుబాటులోకి వచ్చాయని కుటుంబ సమేతంగా సినిమాలను చూసి ఆనందభర్తంగా ఉండాలని ఆకాంక్షించారు.
అంతేకాకుండా అమెరికా నుండి తెచ్చిన తాజా నబ్రస్క మొక్కజొన్న అనేక రకమైన రుచికరమైన మసాలా దినుసులతో సినిమా చూసే వారికి పాప్కాన్ అనుభవానిస్తుందన్నారు. థియేటర్ లోపల విశాలమైన లాబీలు, సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియాలో సులభమైన టికెటింగ్ వ్యవస్థ, అతిథుల కోసం ఉచిత వైఫై వంటి సౌకర్యాలతో అద్భుతంగా రూపొందించబడిందన్నారు.
సాంకేతికత సౌకర్యం, ఆహ్లాదకరమైన ఆహార పానీయాల అనుభవంపై దృష్టి సారించడంలో స్టూడియో 81 సినిమా రంగంలో ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతూ ప్రతి సినిమా అనుభవాన్ని ఒక సంపూర్ణ వినోదభరిత అనుభవంగా మారుస్తుందని సందేహం లేదన్నారు.
