ఆనందంతో వాటేసుకున్నాడు. గుండె ఆనందాన్ని పట్టలేకపోయింది
తన అభిమాన హీరోను దగ్గరగా చూసి మనసారా ఆలింగనం చేసుకున్న ఆ అభిమాని గుండె ఆ ఆనందాన్ని పట్టలేకపోయిందేమో... ఒక్కసారిగా ఆగిపోయింది. కన్నడ సినీ హీరో, బహుభాషా నటుడు సుదీప్‌ను వాటేసుకున్న అభిమాని కాసేపటికే కన్నుమూశాడు.

సుదీప్ తన కొత్త సినిమా హెబ్బులి విజయయాత్ర ప్రారంభోత్సవం కోసం సోమవారం తుమకూరు పట్టణంలోని గాయత్రి థియేటర్‌కు వచ్చాడు. సుదీప్‌ను చూడటానికి భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు.
హోటల్ కార్మికుడైన శశిధర్(45)కు సుదీప్ అంటే వీరాభిమానం. అతడు సుదీప్‌తో కరచాలనం చేసి కార్యక్రమంలో సందడి చేశాడు. ఆ ఆనందంలో ఇంటికి వెళ్తుండగా, మార్గమధ్యలో గుండె పోటుతోకుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా శశిధర్ మరణించాడు.