ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (10:51 IST)

సన్నీ లియోన్ దత్తత తీసుకున్న పాప ఫోటో మీరూ చూడండి..

సినిమాల్లో శృంగార తారగా వెలుగొందుతున్న సన్నీలియోన్ ఓ బాలికను దత్తత తీసుకుంది. సన్నీ కూతురు నిషా కౌర్ వెబర్ ఫస్ట్ ఫోటో అంతర్జాలంలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని లాతూరు నగరానికి చెందిన ఓ బాలికను దత్త

సినిమాల్లో శృంగార తారగా వెలుగొందుతున్న సన్నీలియోన్ ఓ బాలికను దత్తత తీసుకుంది. సన్నీ కూతురు నిషా కౌర్ వెబర్ ఫస్ట్ ఫోటో అంతర్జాలంలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని లాతూరు నగరానికి చెందిన ఓ బాలికను దత్తత తీసుకుంది. ఆ చిన్నారికి సన్నీలియోన్, డెనియల్ వెబర్ దంపతులు నిషా కౌర్ వెబర్ అని నామకరణం చేశారు. 
 
ఈ విషయాన్ని ‘మస్తీజాదే’ సినిమాలో నటించిన షెర్ల్యాన్ చోప్రా తెలిపింది. సన్నీ దంపతులు దత్తత తీసుకున్న చిన్నారి నిషాకౌర్‌కు స్వాగతం అంటూ షెర్ల్యాన్ చోప్రా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. చిన్నారిని దత్తత తీసుకున్న సన్నీలియోన్ దంపతులను చోప్రా అభినందించింది. 
 
తోటి నటి షెర్ల్యాన్ చోప్రా పెట్టిన పోస్టుకు కృతజ్ఞతలు అంటూ సన్నీలియోన్ సమాధానం ఇచ్చింది. సన్నీలియోన్-డేనియల్ గత 2011లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 21 నెలల నిషా కౌర్‌ను దత్తత తీసుకున్న సన్నీ లియోన్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
 
సన్నీ లియోన్ 2012లో బాలీవుడ్‌ అరంగేట్రం చేసింది. రాగిని ఎమ్ఎమ్ఎస్ 2 వంటి సినిమాల్లో నటించిన సన్నీ లియోన్.. షారూఖ్ ఖాన్ రయీస్ సినిమాలో ఓ పాటకు చిందేసిన సంగతి తెలిసిందే.