యాహూ.. నరేంద్ర మోడీని మించిపోయిన పోర్న్ స్టార్ సన్ని లియోన్...
శృంగార తార నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రమోటైన సన్నీ లియోన్ హవా మాములుగా లేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లని మించిపోయింది. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ?
శృంగార తార నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా ప్రమోటైన సన్నీ లియోన్ హవా మాములుగా లేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లని మించిపోయింది. ఇంతకీ ఏ విషయంలో అంటారా.. ? ఆమె కోసం వెతికే నెటిజన్ల సంఖ్యలో. వరుసగా ఐదో ఏడాది మోస్ట్ సెర్చ్‌డ్ పర్సనాలిటీగా నిలిచింది. తాజాగా, ఈ విషయాన్ని యాహూ ఇండియా వెల్లడించింది.
మహిళల జాబితాలో సన్ని ఫస్ట్ రాగా, పురుషుల జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలి స్థానంలో నిలిచారు. మిగితా స్థానాలలో టీవీ స్టార్ కపిల్ శర్మ, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఉన్నారు. మహిళల జాబితాలో సన్నీ లియోన్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్లు బిపాసా బసు, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్ ఉన్నారు.
మొత్తంగా చూస్తే మాత్ర సన్నీ నే టాప్ ప్లేస్ లో ఉంది. అప్పట్లో సన్నీ చేసిన సినిమాల కోసం ఇప్పటికీ గిరాకీ ఉందని యాహూ.. ద్వారా మరోసారి స్పష్టమైందన్న మాట. అయినా ఇప్పుడు పోర్న్ సినిమాలు చేయడం మానేసినా కోసం.. ఈ అమ్మడు కోసం అంతర్జాలంలో వెతుకులాట మాత్రం నెటిజన్లు మానడం లేదు.