శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (12:11 IST)

పద్మావత్‌కు బ్రేక్ వేయలేం : తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావత్‌'కు బ్రేకులు వేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు మళ్లీ తిరస్కరించింది.

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావత్‌'కు బ్రేకులు వేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని వేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు మళ్లీ తిరస్కరించింది. ఆ చిత్రాన్ని బ్యాన్ చేయలేమని తేల్చి చెప్పింది. పైగా, ఆయా రాష్ట్రాలు ఫిల్మ్‌ను ప్రదర్శించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
 
శాంతిభద్రత సమస్యలు ఉత్పన్నమయ్యే నేపథ్యంలో పద్మావత్‌ను రద్దును చేయాలని రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. దీనికి బదులుగా సినిమా చూడవద్దు అని ప్రజలకు సలహా ఇవ్వాలంటూ కోర్టు తన తీర్పులో ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
 
పద్మావత్‌ను వ్యతిరేకిస్తున్న కర్ణిసేనకు కూడా ఈ విషయాన్ని చేరవేయాలంటూ కోర్టు తెలిపింది. సినిమా రిలీజ్‌కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరీ ఉత్కంఠంగా మారడం, సుప్రీంకోర్టు ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.