ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:04 IST)

విన్నర్‌లో అనసూయ ఐటమ్ సాంగ్ అదుర్స్... ఆడియో వినండి..

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ - రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం విన్నర్. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో బుల్లితెర యాంకర్ అనసూయ తన అందాలను ఆరోబోసిందట. గతంలో హీరో నాగార్జున

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ - రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం విన్నర్. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో బుల్లితెర యాంకర్ అనసూయ తన అందాలను ఆరోబోసిందట. గతంలో హీరో నాగార్జున నటించి 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రంలోని ఓ పాటలో స్పెషల్‌గా మెరిసిన విషయం తెల్సిందే.
 
అయితే, ఆమె లేటెస్ట్‌గా ఐటెమ్‌సాంగ్‌ చేసింది. దీనికి సంబంధించి సాంగ్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. నాలుగున్నర నిమిషాల నిడివిగల ఈ వీడియోలో అనసూయ ఫోటోలు మాత్రమే కనిపించాయి. అంతకుమించి మరేమీలేదు.. కాకపోతే స్పీడ్ సాంగ్ కావడంతో డ్యాన్స్ కూడా అలాగే వుంటుందని భావిస్తున్నారు. ఇక లిరిక్స్ కూడా అనసూయ పేరుతో వుండటం గమనార్హం.
 
సెట్ మాత్రం మాంచి కలర్‌ఫుల్‌గా వుంది. అనసూయ సాంగ్ మూవీకే హైలైట్ అని యూనిట్ భావన. గతంలో సోగ్గాడే చిన్నినాయనలో ఓ సాంగ్‌లో మెరిసిన అనసూయ, పెద్దగా ఎట్రాక్ట్ చేసుకోలేకపోయింది. ఈసారైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి. కాగా, ఈ చిత్రాన్ని ఈనెల 24న రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో చిత్ర యూనిట్ ఉంది.