గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 జనవరి 2021 (13:51 IST)

Tamannah ఆ పని దగ్గరకొచ్చేసరికి టైం లేదనీ, బిజీ అనీ చెప్పకండి అంటోన్న తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా చూసేందుకు చాలా సుకుమారంగా కనిపిస్తున్నప్పటికీ ఆమె చాలా స్ట్రాంగ్ అనే విషయాన్ని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. తన ఆకృతిపై అత్యంత శ్రద్ధ పెడుతోంది తమన్నా. రోజుకి కనీసం గంటకు పైగా వ్యాయామం కోసం టైం కేటాయిస్తోందట.
 
తను జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పంచుకుంటూ తమన్నా ఇలా చెప్పుకొచ్చారు. ఏ పనినైనా మరీ అతిగా చేయాల్సిన పనిలేదు. స్థిరత్వంగా చేస్తే చాలు.
 
కేవలం రెండు నెలల పాటు క్రమశిక్షణతో వర్కవుట్స్ చేసాను. అంతే.. నాకు కోవిడ్ రాక ముందు ఎలా వుండేదాన్నో ఇప్పుడు అలా మారిపోయాను. చాలామంది వర్కవుట్స్ దగ్గరకు వచ్చేసరికి టైం లేదనీ, బిజీ అనీ ఏవేవో వంకలు చెపుతారు. అలాంటివి చెప్పకండి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం మరువకండి అని పిలుపునిచ్చింది.