మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 8 జనవరి 2018 (20:02 IST)

తరుణ్‌ లవ్‌స్టోరీ ట్రైలర్‌ ఇదే(వీడియో)

చాలాకాలం తర్వాత తరుణ్‌ హీరోగా నటించిన సినిమా 'ఇది నా లవ్‌స్టోరీ'. ఇదేదో రియల్‌ లవ్‌స్టోరీ అనుకునేరు. సినిమా కథ. ఓవియా హీరోయిన్‌గా నటించింది. రమేష్‌ గోపీ దర్శకులు. ఎస్‌.వి.ప్రకాష్‌ నిర్మాత. సోమవారం హీరో తరుణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా హీరో తరుణ్‌ ఈ స

చాలాకాలం తర్వాత తరుణ్‌ హీరోగా నటించిన సినిమా 'ఇది నా లవ్‌స్టోరీ'. ఇదేదో రియల్‌ లవ్‌స్టోరీ అనుకునేరు. సినిమా కథ. ఓవియా హీరోయిన్‌గా నటించింది. రమేష్‌ గోపీ దర్శకులు. ఎస్‌.వి.ప్రకాష్‌ నిర్మాత. సోమవారం హీరో తరుణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా హీరో తరుణ్‌ ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. 
 
ప్రకృతి అందాల్ని ఫొటోలో బంధిస్తూ.. 'ఇది నా లవ్‌స్టోరీ' అంటూ తరుణ్‌ చెబుతుండగా ట్రైలర్‌ ఆరంభమవుతోంది. వెంటనే హీరోయిన్‌ను చూసి 'డా. శ్రుతి' అనడం.. తనేమో.. హండ్రెడ్‌కు నైంటీనైన్ పర్సంట్‌ అభిరామ్‌ అనడం.. హండ్రెండ్‌ పర్సన్‌ అంటూ తరుణ్‌ చెప్పడం జరుగుతుంది. ఈ ఇద్దరి లవ్‌స్టోరీ ఎలా వుందనేది దీనిద్వారానే తెలుస్తుంది. 
 
ఆ వెంటనే 'చూశాను.. నచ్చావ్‌.. లవ్‌ చేస్తే బాగుంటుందనిపించింది' అంటూ మొహంమీద తరుణ్‌ చెప్పేయడం.. ఏమీ దాచుకోకుండా మాట్లాడే లక్షణాలుగా కన్పిస్తున్నాయి. ఆ వెంటనే పాట ప్రారంభమవుతుంది. 'ఐ మిస్‌ యు నిన్నెంతకాలం.. ఐ లవ్‌ యు చెప్పాలి' అనేది సారాంశం. 'మనస్సుంది ప్రేమించకుండా వుంటుందా?' అంటూ హీరోయిన్‌ అనడం.. లవ్‌కు పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతుంది. 
 
ఆ తర్వాత 'కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే చాలు. కళ్ళలో పెట్టి చూసుకుంటాం' అనే డైలాగ్‌తో వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు. అయితే 'లవ్‌ ప్రపోజ్‌ చేస్తే ఎందుకు పాజిటివ్‌గా ఆలోచించరు' అని తరుణ్‌ అంటే.. 'మగాళ్ళు స్లో పాయిజిన్‌.. అంటూ హీరోయిన్‌..' చెప్పడంతో.. ఇద్దరి మధ్య ప్రేమ వాగ్వివాదం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. 'నీపై వున్న ఎట్రాక్షన్‌ను లవ్‌ అనుకున్నా. కానీ లవ్‌కు లైఫ్‌కు డిఫరెంట్‌ ఏమిటో ఇప్పుడు తెలిసిందంటూ.. చెప్పడంతో ఆ వెంటనే.. జైలులో వున్నట్లు షాట్‌ చూపించడం... ఏదో జరగరానిది జరిగిందంటూ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేయడం చూపించాడు. 
 
తరుణ్‌ గడ్డం పెంచిన షాట్‌.. ఎపడూ అబ్బాయిలే దేవదాసులా మనమే అయిపోతే పోలా.. అనే హీరోయిన్‌ పలికిన పలుకులే.. తను అలా అవ్వాలనుకున్నట్లుగా కన్పిస్తుంది. ఇక గుడిలో ధర్మ దర్శనానికి పెద్దక్యూ.. 50 రూపాయల దర్శనానికి చిన్న క్యూ.. 500 ఇస్తే గర్భగుడిలోకి.. 5 వేలిస్తే దేవుడ్ని ఇంటికే తీసుకువస్తారనేది' తరుణ్‌ పలికే డైలాగ్‌. ఇది ఎందుకు అనాల్సి వచ్చిందనేది కథలోని కీలక పాయింట్‌. అలా ఎందుకన్నాడనేది చిత్రంలో చూడాల్సిందే. అందుకు ఫిబ్రవరి 14 వరకు ఆగాల్సిందే.