శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (18:08 IST)

తీస్ మార్ ఖాన్ అందరినీ ఆకట్టుకుంటుంది - తిరుపతి రెడ్డి

Tirupati Reddy, Adi Sai Kumar, kalyna g.gogana and others
Tirupati Reddy, Adi Sai Kumar, kalyna g.gogana and others
స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం "తీస్ మార్ ఖాన్". విజన్ సినిమాస్ బ్యానర్ పై డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.  పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుంది. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం *ఆగస్ట్ 19న* విడుదల కానుంది. 
 
ఈ సందర్బంగా  హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, ఈ మధ్య నేను కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు చేశాను కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేశాను కానీ పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్సియల్ సినిమాలు చేసి చాలా రోజులు అయ్యింది అనుకుంటున్న టైమ్ లో దర్శకుడు  కళ్యాణ్ ఈ కథ చెప్పడం జరిగింది. విన్న వెంటనే ఈ కథకు మంచి స్పాన్ ఉందని ఖర్చు కూడా ఎక్కువ అవుతుందనుకున్నాను. అయితే మా నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి గారు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. ఇప్పటి వరకు మేము అన్ని పాటలు ఆన్ లైన్ లోనే రిలీజ్ చేసాము. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కొరకు నిర్మాతలు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ అయ్యాంగార్ సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ,పూర్ణ వంటి మంచి కాస్టింగ్ పెట్టుకున్నారు. ప్రతి సారి సాయి కార్తీక్  నాకు మంచి మ్యూజిక్ ఇస్తారు. డి. ఓ. పి. గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమా డేట్ అనౌన్స్ చేసిన తరువాత  థియేటర్స్ కు జనాలు వస్తారా రారా అని భయముండేది. అయితే బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలతో అందరికీ మంచి హోప్ ని ఇచ్చాయి. *ఆగస్టు 19* న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ  ఆదరించి  ఆశీర్వాదించాలని అన్నారు.
 
నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, చిత్ర దర్శకుడు కళ్యాణ్ చెప్పిన  కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి  ముందుకు వచ్చాను. మేము విడుదల చేసిన  టీజర్ కు ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. ఈ నెల 19 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ,  ఇప్పటి వరకు  కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు తీశాను. ఇప్పుడు పక్కాగా కంటెంట్, మరియు కమర్సియల్ ను మిక్స్ చేసి తీసిన సినిమా అందరికీ నచ్చుతుంది. ఇందులో ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటుంది. నేను .ఇంతకుముందు నేను బిగ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ను కాదు  అయినా నేను ఈ కథ చెప్పగానే  నన్ను నా కథను నమ్మి ఇంత పెద్ద కాస్టింగ్ ఇచ్చారు. హీరో ఆది గారికి ఈ కథ నచ్చుతుందా లేదా అని టెన్షన్ పడ్డాను. తను నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. సాయి కార్తిక్ గారు నేను అనుకున్న దానికంటే  మంచి అవుట్ పుట్ ఇచ్చారు. శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్ బాగుంటుంది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదములు. 
 
 మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ..* ఈ సినిమాకు మంచి కాస్టింగ్ దొరికింది .ఈ సినిమా కళ్యాణ్ కు, ఆదికి బిగ్ హిట్ అవ్వాలని కోరుతున్నాను. దర్శక, నిర్మాతలు మంచి ఏమోషనల్ ప్లాట్ ను పట్టుకొని మంచి యాక్షన్ సినిమా తీశారు. ఈ సినిమాలో నటించిన వారందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.